గణతంత్ర వేడుకులకు కెయు విద్యార్థిని ఎంపిక

Dec 30,2023 08:30 #Celebrations, #Republic Day 2024

ప్రజాశక్తి-మచిలీపట్నంరూరల్‌ :ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కఅష్ణా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని, 16వ ఆంధ్ర బెటాలియన్‌ ఎన్‌సిసి క్యాడెట్‌ టి.లక్ష్మి దమయంతి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ కళాశాల ఎఎన్‌ఒ లెఫ్టనెంట్‌ డాక్టర్‌ డి.రామశేఖరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్‌లో నిర్వహించిన ఏడు శిక్షణ శిబిరాల్లో పది వేల మంది క్యాడెట్స్‌ పాల్గనగా లక్ష్మి దమయంతి ఉత్తమ ప్రతిభ కనబరచినట్లు తెలిపారు. ఎన్‌సిసి విభాగం పురోగమించడానికి, విద్యార్థులు ఎన్‌సిసిలో ఉత్తమ ప్రదర్శన సాధించడానికి వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.జ్ఞానమణి ప్రోత్సాహం ధోహదపడిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మి దమయంతిని వర్సిటీ విసి జ్ఞానమణి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి.వి.బ్రహ్మచారి, కళాశాల ప్రిన్సిపల్‌ ఆర్‌.విజయకుమారి, 16వ ఆంధ్ర బెటాలియన్‌ కమాండెంట్‌ కల్నల్‌ సంసార్‌ సింగ్‌, తదితరులు అభినందించారు.

➡️