ఎడిసిఎల్‌ ఛైర్‌పర్సన్‌గా లక్ష్మీ పార్థసారధి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎడిసిఎల్‌) ఛైర్‌పర్సన్‌గా లక్ష్మీ పార్థసారధిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఉత్తర్వులు అమల్లోకి వస్తుందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. సిఆర్‌డిఎ ఏర్పాటుచేసిన సమయంలో నిధుల సమీకరణ, పనులకు సంబంధించి ఎడిసిఎల్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐఎఎస్‌ అధికారి లక్ష్మీ పార్థసారధిని నియమించారు. ప్రభుత్వం మారడంతో ఆమె పదవి కోల్పోయింది. అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను సిఆర్‌డిఎలో విలీనం చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో మరలా డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు జవసత్వాలు తెచ్చారు. రాజధానికి సంబంధించిన అన్ని పనులూ ఎడిసిఎల్‌ ఆధ్వర్యాన జరగనున్నాయి. ఎడిసిఎల్‌ ఛైర్‌పర్సన్‌ హోదాలో గతంలో అనేక దేశాల ప్రతినిధులు, పెట్టుబడిదారులతో లక్ష్మీ పార్థసారధి నేరుగా చర్చలు జరిపారు.

➡️