శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

Jun 3,2024 22:54 #Tirumala Temple, #ttd
  • నేటి నుంచి ఆంధ్రాకు మంచి రోజులు : రేణుక చౌదరి

ప్రజాశక్తి – తిరుమల : తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించకున్నారు. విఐపి బ్రేక్‌ సమయంలో రాజ్యసభ మాజీ సభ్యులు రేణుకచౌదరి తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆమె మాట్లాడుతూ.. నేటి నుంచి రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు. దేశ ప్రగతికి కాంగ్రెస్‌ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ‘ఎగ్జిట్‌ పోల్స్‌పై మీ అభిప్రాయం ఏమిటీ?’ అని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘సర్వేలను నమ్మే పరిస్థితి లేదని, రిజల్ట్స్‌ రోజున ఏ పార్టీ గెలుస్తుందో తెలుస్తుందన్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో శ్రీకాళహస్తి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్‌ రెడ్డి, సినీ నటి సుమలత ఉన్నారు.

➡️