Krishna dist.. road accident – రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద జాతీయ రహదారి పై రెండు లారీలు ఢీకొట్టుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో రెండు లారీల డ్రైవర్లు ఉన్నారు. చనిపోయినవారిలో ఐదుగురు పశ్చిమగోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా అధికారులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, ఆరుగురికి రూ. 30 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Accident: ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు మృతి

➡️