వందేభారత్‌ రైలులో ప్రయాణించిన మంత్రి రోజా

గుంటూరు : గుంటూరు నుండి తిరుపతికి వందే భారత్‌ రైలులో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి రోజా శనివారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా రోజు మాట్లాడుతూ … వందేభారత్‌ ట్రైన్‌ చాలా శుభ్రంగా బాగుందని అన్నారు. ఈ ట్రైన్‌ లో ప్రయాణించడం వల్ల గమ్యాన్ని చాలా తొందరగా సేఫ్‌ గా చేరుకోవచ్చని అన్నారు. చిన్న పిల్లలకు, పెద్దలకు ఈ ట్రైన్‌ ప్రయాణం ఆహ్లాదకరంగా కూడా ఉంటుందని, భోజనం కూడ చాలా బాగుందని చెప్పారు.

➡️