గవర్నర్‌ ప్రసంగంపై ఎమ్మెల్యే కేటీఆర్‌ ఫైర్‌..

Dec 16,2023 12:36 #KTR, #Telangana Assembly Sessions

హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. నాలుగోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం గవర్నర్‌ ప్రసంగంపై కేటీఆర్‌ మాట్లాడారు. నక్క మోసం చేయనని, పులి మాంసం తినను అని వాగ్వాదం ఇచ్చినట్లు గవర్నర్‌ ప్రసంగం ఉందని అన్నారు. తాము ఎక్కడ ఉన్నా ప్రజా పక్షమేనని తెలిపారు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణాలన్నీచేసి కేవలం పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయించారని కాంగ్రెస్‌ పార్టీపై కేటీఆర్‌ మండిపడ్డారు. గవర్నర్‌ గారి దారుణమైన ప్రసంగం విన్నాక కాంగ్రెస్‌ పాలనలో రాబోయే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో స్పష్టంగా తెలిసిపోయిందని చెప్పారు.

➡️