ఎస్‌జిఎఫ్‌ కార్యదర్శిగా కృష్ణంరాజు

Jun 28,2024 20:26

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లా స్కూలు గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శిగా కొత్తవలస మండలం దెందేరు జెడ్‌పి హైస్కూలు వ్యాయామ ఉపాధ్యాయులు పి.కృష్ణంరాజు ఎంపికయ్యారు. ఈమేరకు శుక్రవారం జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్‌ ప్రేమ్‌ కుమార్‌ ఉత్తర్వులు అందజేశారు. సీనియారిటీ ప్రాతిపదిక ఎంపికైన కృష్ణంరాజు స్వతహాగా జాతీయ స్థాయి క్రీడాకారుడు. వాలీబాల్‌ జూనియర్స్‌ విభాగంలో జాతీయ స్థాయిలో ఆడారు. ఎంతోమంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులను అందించారు. అన్ని విధాలా మెరిట్‌ ఆధారంగా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శిగా ఎంపిక చేసినట్లు డిఇఒ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను రాష్ట్ర వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి భగవాన్‌దాస్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సూరిబాబు, కెవిఎఎన్‌రాజు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు.

➡️