జంటనగరాల ప్రయాణికులకు ఎంఎంటీఎస్‌- ఆర్టీసీ కంబైన్డ్‌ పాస్‌

Apr 17,2024 11:15 #combined pass, #MMTS-RTC

హైదరాబాద్‌: జంటనగరాల ప్రయాణికులకు ఎంఎంటీఎస్‌-ఆర్టీసీ కంబైన్డ్‌ బస్‌పాస్‌ను దక్షిణ మధ్యరైల్వే పునరుద్ధరించింది. అటు ఎంఎంటీఎస్‌ రైళ్లల్లో ఇటు టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణించేందుకు వీలుగా కంబైన్డ్‌ బస్‌పాసను రైల్వే, ఆర్టీసీ సంస్థలు సంయుక్తంగా ప్రవేశపెట్టాయి. గతంలో ఉన్న కంబైన్డ్‌ పాస్‌ ధర(రూ.1,050)ను ఇటీవల రూ.1,350కు పెంచారు. కంబైన్డ్‌ బస్‌పాస్‌ను జంటనగరాల్లోని అన్ని ఎంఎంటీఎస్‌ స్టేషన్ల(టికెట్‌ కౌంటర్ల)లో జారీచేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ కంబైన్డ్‌ పాస్‌ ఎంతో ప్రయోజనకరంగా ఉందని ఎంఎంటీఎస్‌ ప్రయాణికుల సంఘం ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

➡️