పోస్టల్‌ బ్యాలెట్‌లలో ధన ప్రవాహం..

May 7,2024 16:53 #Kurnool, #Postal ballot
  •  అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా బహిరంగంగా డబ్బుల పంపిణీ
  •  పోలీసులపై రాజకీయ నాయకుల బెదిరింపులు

ప్రజాశక్తి-పత్తికొండ: నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో పోస్టల్‌ బ్యాలెట్‌లలో ధన ప్రవాహం కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ఉద్యోగులకు  డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పోలింగ్‌ జరిగే ప్రదేశంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని గుంపులు గుంపులుగా ఉన్న రాజకీయ నాయకులను దూరంగా వెళ్లిపోండి అని పోలీస్‌ అధికారులు చెబితే, పోలీసులను సైతం అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు దురుసుగా ప్రవర్తిస్తూ, బెదిరింపులకు గురి చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లోనే ఈ విధంగా ఉంటే, ఈనెల 13న జరిగే పోలింగ్‌ రోజు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. సంబంధిత జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటిస్తారా లేదా వేచి చూద్దాం.

➡️