కొండయ్య నామినేషన్‌లో సినీ హీరో నిఖిల్‌

Apr 25,2024 21:14 #kondaiah, #naminations

ప్రజాశక్తి – చీరాల :టిడిపి చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కొండయ్య పెద్దకుమారుడి బావ, సినీ హీరో నిఖిల్‌ సిద్ధార్థ పాల్గని సందడి చేశారు. హ్యాపీ డేస్‌ సినిమాలోని జిల్‌ జిల్‌ జిగా డైలాగులతో యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. చీరాల అభివఅద్ధి చెందాలన్నా..యువత భవిత బంగారుమయం కావాలన్నా టిడిపి అభ్యర్థి మాలకొండయ్యను గెలిపించాలని కోరారు. ఈ ర్యాలీలో నిఖిల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

➡️