జూన్‌ 15 నుండి ముంబై-విజయవాడ సర్వీస్‌

May 18,2024 21:51 #flights, #Mumbai airport, #Vijayawada

ప్రజాశక్తి-గన్నవరం : ఎయిరిండియా విమాన సంస్థ జూన్‌ 15 నుంచి ముంబై- విజయవాడ మధ్య విమాన సర్వీసును నడపనుంది. బోయింగ్‌ ఎ320 విమానంలో 180 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చును. ఈ విమాన సర్వీస్‌ ప్రతిరోజు సాయంత్రం 3.55 గంటలకు ముంబైలో బయలుదేరి 5.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి 7.10 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి తొమ్మిది గంటలకు ముంబై చేరుకుంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఈ సదుపాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.

➡️