2వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె

municipal workers strike 2nd day

ప్రజాశక్తి-యంత్రాంగం :  మునిసిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మె రెండోవ రోజుకు చేరుకుంది.  వివిధ జిల్లాలో పలు రూపాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

 

municipal workers strike 2nd day atp

చెత్త తరలింపును అడ్డుకున్న సిఐటియు నేతలు

అనంతపురం కార్పొరేషన్ : నగరంలోని పాత ఊరు కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న కార్పొరేషన్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులు యంత్రాలతో తరలించడానికి బుధవారం చేసిన ప్రయత్నాలు సిఐటియు నేతలు ఎర్రి స్వామి తిరుమలేశు తదితరులు అడ్డుకున్నారు ఇన్స్పెక్టర్ రామాంజనేయులు తో వాదులాటకు దిగారు ఒకవైపు కార్మికుల సమ్మె చేస్తుంటే మరోవైపు సమ్మెను నిర్వీర్యం చేయటానికి అధికారులు ప్రయత్నించటం తగదని హెచ్చరించారు సమ్మెను విచిన్నం చేయడానికి అధికారులు, పోటీ కార్మికులను తెచ్చి, యంత్రాలతో తాడిపత్రి బస్టాండు నందు చెత్త తరలించడానికి ప్రయత్నం చేయటం ద్వారా ఏం సాధించాలని కోరుకుంటున్నారని ప్రశ్నించారు చెత్త ఎత్తిన ట్రాక్టర్లు ను అక్కడే డంపింగ్ చేయించారు ఇప్పటికైనా అధికారులు, పోటీ కార్మికులను, దించకుండా, మున్సిపల్ కార్మికుల సమస్యలను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు

 

municipal workers strike 2nd day kadapa

కడప-మైదుకూరు: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటు, మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం మైదుకూరులో మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్మికులందరికీ వెంటనే పర్మినెంట్ చేయాలన్నారు. పెరిగిన నిత్యవసర ధరల మేరకు కార్మికులకు రూ.26వేలు జీతం ఇవ్వాలన్నారు. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపిస్ పెన్షన్ అమలు చేయాలని, కోవిడ్ 19 కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సిఐటియు ట్రెజర్ జి చిన్న, లక్ష్మయ్య శేఖర్ వెంకటసుబ్బయ్య పుల్లమ్మ విశ్వనాథం చిన్న రాముడు నాగయ్య పాపారాయుడు ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

municipal workers strike 2nd day nellore

నెల్లూరు :  నెల్లూరు నగరపాలక సంస్థలో డిసెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి నుండి విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య కార్మికులు ,చెత్త వాహనాల డ్రైవర్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లిన విషయం విదితమే. అందులో భాగంగా రెండో రోజు బుధవారం మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెను కొనసాగించారు. బారాషాహి దర్గా నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలి : ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు ) డిమాండ్ చేశారు.

మునిసిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తలపెట్టిన సమ్మెలో భాగంగా బుధవారం రెండు రోజు నెల్లూరు నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు, డ్రైవర్లు తమ విధులను బహిష్కరించారు. బుధవారం ఉదయం 10 గంటల బారాషాహీ దర్గా నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు )నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో పాదయాత్రలో మరియు అసెంబ్లీలో కాంట్రాక్టర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని లేనిపక్షంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పర్మినెంట్ చేస్తామని చెప్పారని అన్నారు. జగన్ మాటను నమ్మిన మున్సిపల్ కార్మికులు వైసీపీ అధికారంలో రావడానికి తమ వంతు కృషి చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్ళు పూర్తి అయినప్పటికీ ఇంతవరకు పర్మినెంట్ దిశగా ఏ చర్యలు చేపట్టలేదు అని అన్నారు. జగన్ ఇచ్చిన వాగ్దానం మేరకు తక్షణమే కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఇచ్చిన మాట అమలు చేసే వరకూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. వైసిపి ప్రభుత్వం మొండి వైఖరి కారణంగానే విధి లేని పరిస్థితుల్లో నిరవధిక సమ్మె చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.ప్రజలు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మున్సిపల్ కార్మికుల పోరాటానికి మద్దతును అందించాలని విజ్ఞప్తి చేశారు.

 

మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా రెండవ రోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిలబడి కార్మికులు నిరసన  తెలిపారు.

తాడేపల్లిగూడెం కాంట్రాక్టు మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ పట్టణ కమీటీ ఆధ్వర్యంలో వరుసగా రెండో రోజు తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం ఎదుట మొకాళ్లపై నుంచుని నిరసన వ్యక్తం చేశారు.

municipal workers strike 2nd day visakha

విశాఖ : మున్సిపల్ కార్మికుల సమ్మె జిపిఎంసి జోన్ ఫోర్ ఆఫీస్ వద్ద మోకాళ్లపై నిరసన తెలియజేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు నాయకులు నూకరాజు రాజుకుమారి

 

municipal workers strike 2nd day a

జిల్లా కేంద్రంలో బుధవారం పార్వతీపురం మునిసిపల్ కార్యాలయం ముందర మునిసిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మకులు ఒంటి కాలిపై నిరసన వ్యక్తం చేశారు.

➡️