విశాఖలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

Jan 5,2024 12:18 #Nara Bhuvaneshwari, #Visakha, #Yatra

విశాఖ : నారా భువనేశ్వరి శుక్రవారం విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖ 33వ డివిజన్‌ వెంకటేశ్వర మెట్టుకు చేరుకున్న భువనేశ్వరి అక్కడి నుండి ‘నిజం గెలవాలి’ యాత్రను ప్రారంభించారు. గతంలో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించినవారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. టిడిపి కార్యకర్త జాగరపు చిన్నా కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. పలువురు బాధితుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకొని హైదరాబాద్‌కు ప్రయాణమవుతారు.

➡️