‘మహిళా సమస్యల’పై ప్రణాళిక అవసరం

Need to plan on women's issues

మహిళా మేనిఫెస్టోపై వక్తలు 

ప్రజాశక్తి-విజయవాడ : మహిళా సమస్యల పరిష్కారానికి నిర్ధిష్టమైన ప్రణాళిక అవసరమని మహిళా సంఘాల ఐక్యవేదికలో వ్యక్తలు పేర్కొన్నారు. మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహిళా మేనిఫెస్టోపై చర్చా కార్యక్రమాన్ని విజయవాడలోని బాలోత్స భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై, పసిబిడ్డలపై అత్యాచారాలు ఆందోళనకరస్థాయిలో పెరుగుతూనే ఉన్నాయని ఆగ్రహించారు. మహిళలపై సాగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు త్వరితంగా విచారణ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం దిశ పేరిట చట్టం చేసి పంపినా కేంద్రం ఆమోదించ లేదని అన్నారు. మహిళల పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తున్నదన్నారు. ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం 2020 కంటే 2021లో రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు 25% పెరిగాయని వెల్లడించారు. నేరాలలో రాష్ట్రం 6వ స్థానంలో ఉందని, వాస్తవంగా జరుగుతున్న అత్యాచార ఘటనలను రిపోర్టు చేయడానికి, కేసు పెట్టడానికి 90 శాతం ప్రజలు ముందుకు రారని ఒక సర్వే తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️