రాజకీయాల నుండి తప్పుకుంటున్నా : గల్లా జయదేవ్‌

Jan 28,2024 11:45 #elections, #Galla Jayadev, #resigned

గుంటూరు : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంలేదని టిడిపి గుంటూరు ఎంపి గల్లా జయదేవ్‌ ప్రకటించారు. తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నాయని వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందులపై మౌనంగా ఉండలేనని, అందుకే రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే గల్లా జయదేవ్‌ తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణ కుమార్‌ కొన్నాళ్ల కిందటే పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. అనారోగ్య కారణాలతో ఆమె రాజకీయాల నుంచి తప్పుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లోపనిచేసిన గల్లా కుటుంబం రాష్ట్ర విభజనతో టిడిపిలోకి వచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి అరుణ, గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి గల్లా జయదేవ్‌లు 2014లో పోటీ చేశారు. అరుణ ఓడిపోగా.. జయదేవ్‌ విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత.. అరుణ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కానీ, జయదేవ్‌ 2019లో గుంటూరు నుంచి మరోసారిపోటీ చేసి విజయందక్కించుకున్నారు. అయితే.. రాజకీయాల్లో ఉన్న కారణంగా తన వ్యాపారాలకు ఇబ్బందులు వస్తున్నాయని.. అధికారులు సహకరించడం లేదని.. కొన్నాళ్లుగా ఆయన అసంతృప్తితో ఉన్నారు.

➡️