ఒక ఫ్యాన్‌.. 2 బల్బులు – నెలకు కరెంటు బిల్లు రూ.వెయ్యి..!

రేగిడి (విజయనగరం) : ‘ ఒక ఫ్యాన్‌, 2 బల్బులు, నెలకు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు ‘..! కూలి పనులు చేసుకునేవాళ్లం ఎలా కట్టగలం అంటూ … విజయనగరంలోని సంకిలి గ్రామస్తులు వాపోతున్నారు. మంగళవారం వారు తమ గోడును ప్రజాశక్తితో వెళ్లబోసుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ … కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నామన్నారు. ఇంటికి ఒక ఫ్యాన్‌, రెండు బల్బులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ప్రతి నెల రూ.600 నుంచి 1000 రూపాయలు వరకు కరెంటు బిల్లులు వస్తున్నాయని… దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. గత ప్రభుత్వంలో రెండు నెలల రీడింగ్‌ కు 125 రూపాయల నుంచి 200 రూపాయలు లోపే విద్యుత్‌ బిల్లులు వచ్చేవని.. ప్రస్తుతం కరెంటు రీడింగ్‌ తక్కువ అయినప్పటికీ విద్యుత్‌ బిల్లులు ఘోరంగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కరెంటు బిల్లులను తగ్గించాలని కోరుకున్నారు.

➡️