రంగారెడ్డి జిల్లాలో వంద కిలోల గంజాయి పట్టివేత

Dec 15,2023 15:30 #ganjai, #seaz

రంగారెడ్డి : అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండల పరిధిలోని సురంగల్‌ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో పెద్ద ఎత్తున గంజాయిని నిల్వ చేశారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి రు.5.50 లక్షల విలువ గల వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, గంజాయిని విక్రయించినా, సాగు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి గురించి ఎలాంటి సమాచారం తెలిసినా పోలీసులకు సమాచారం అందించాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.

➡️