పవన్‌ పొలిటికల్‌గా పనికిరాడు : మంత్రి రోజా

ప్రజాశక్తి-తిరుపతి : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్‌గా పనికిరాడని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుపతిలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన 94 నియోజకవర్గాల్లో నారా లోకేష్‌ మంగళగిరి, బాలకృష్ణకు హిందూపురం, చంద్రబాబు నాయుడు కుప్పం , టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడుకు టెక్కలి సొంత నియోజకవర్గ ప్రకటించారని, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు కనీసం సొంత నియోజకవర్గాలు కూడా ఇప్పటివరకు ఎంపిక చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా జనసేన అధినేత సొంతంగా ఆలోచించి తనను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలను సంతోష పరచాలని సూచించారు.

➡️