మళ్లీ ప్రచార బరిలోకి పవన్‌ కల్యాణ్‌

Apr 5,2024 17:33 #JanaSena, #pavan kalyan, #Yatra

ప్రజాశక్తి-అమరావతి : జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ఆపుకుని హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఆయన కోలుకున్న నేపథ్యంలో, మళ్లీ ప్రచార బరిలో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 7న అనకాపల్లిలో, ఈ నెల 8న ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలకు పవన్‌ హాజరవుతారు. ఈ నెల 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

➡️