చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌, పురందేశ్వరి భేటీ..

ప్రజాశక్తి-అమరావతి : అమరావతిలోని చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జనసేనాని పవన్‌ కల్యాణ్‌, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్‌ సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ కూడా భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహరచన, ఉమ్మడి మేనిఫెస్టో, రాష్ట్ర ప్రచారానికి జాతీయ నేతలను ఆహ్వానించడం తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.

➡️