విజయవాడకు చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

Jun 18,2024 10:56 #pawan kalyan, #reached, #Vijayawada

అమరావతి : ఎపి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్‌పోర్టులో జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. పవన్‌ నేడు సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి రానున్న ఆయన.. రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బుధవారం తన ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది.

➡️