పెండింగ్‌ వేతనాలు, బిల్లులు చెల్లించాలి

Jan 11,2024 08:14 #CITU leader, #Mid-Day Meal
  • మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌
  • మంత్రి బొత్సకు వినతి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు పెండిగ్‌ వేతనాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ కోరింది. విజయవాడలో బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను యూనియన్‌ ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి, నాయకులు సమ్మక్క, ఎం లలితకుమారి, కె మణి కలిసి వినతిపత్రం అందించారు. పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, 12 నెలలకు వేతనాలు ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు రూ.20కి పెంచాలని, ప్రమాదబీమా, సౌకర్యం కల్పించాలని కోరారు. గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలని, ఇఎస్‌ఐ సౌకర్యం తదితర డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌ వేతనాలను త్వరలో చెల్లిసామని మంత్రి నాయకులతో చెప్పారు.

➡️