ఉపాధ్యాయుల ఉద్యమంపై పోలీసుల ఉక్కుపాదం..

Jan 9,2024 11:59 #Police force, #Protest, #Teachers

శ్రీకాకుళం : బకాయిపడ్డ వేతనాలను చెల్లించాలని కోరుతూ… నేడు యుటిఎఫ్‌ ఆధ్వర్యాన విజయవాడలో చేపట్టిన ధర్నాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిన్న అర్థరాత్రి నుండే అరెస్టుల పర్వం మొదలైంది. ఈరోజు ఉదయం విజయవాడ అలంకార్‌ సెంటర్‌ వద్ద నిరసన తెలిపిన ఉపాధ్యాయులను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు బకాయి పడ్డ ఆర్థిక వేతనాలు మంజూరు చేయాలని కోరుతూ … యుటిఎఫ్‌ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మంగళవారం విజయవాడలోని ధర్నాకు బయలుదేరిన టెక్కలి మండల ఉపాధ్యాయులను విజయవాడలోని పోలీసులు అరెస్టు చేశారు.

➡️