రాజధానిలో పోలీస్‌ కవాతు

Mar 3,2024 11:35 #AP Capital, #Police parade

ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు) : అమరావతి రాజధాని గ్రామాల్లో ఆదివారం పోలీస్‌ కవాతు నిర్వహించారు. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో … అనంతవరం, నెక్కల్లు, వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లో సెంట్రల్‌ ఆర్మ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిఎపిఎఫ్‌), స్థానిక పోలీసులు కవాతు జరిపారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో సజావుగా జరగాలని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️