నేడు త్రిపుల్‌ఐటి డిఎంను ప్రారంభించనున్న ప్రధాని

Feb 20,2024 08:46 #IIIT, #Kurnool
  •  డైరెక్టర్‌ సోమయాజులు వెల్లడి

ప్రజాశక్తి – కర్నూలు కలెక్టరేట్‌ : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ (త్రిపుల్‌ఐట డిఎం) విద్యాసంస్థను మంగళవారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించనున్నట్లు ఆ విద్యాసంస్థ డైరెక్టర్‌ సోమయాజులు వెల్లడించారు. సోమవారం త్రిపుల్‌ఐటి డిఎం కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జగన్నాథగట్టుపై దాదాపు 151 ఎకరాల్లో నిర్మించిన త్రిపుల్‌ఐటి డిఎం విద్యాసంస్థను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని తెలిపారు. రూ.296.12 కోట్ల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో 16 తరగతి గదులు, 22 ప్రయోగశాలలు, లైబ్రరీ, కంప్యూటర్‌ సెంటర్‌, మూడు సెమినార్‌ హాళ్లు, నాలుగు హాస్టళ్లు, రెండు మెస్‌ బ్లాక్‌లు, డైరెక్టర్‌ బంగ్లా, 20 ఫ్యాకల్టీ క్వార్టర్లు, రెండు సబ్‌స్టేషన్లు, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లు నిర్మించామన్నారు. ప్రస్తుతం క్యాంపస్‌లో మొత్తం 907 మంది విద్యార్థులు నాలుగు అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లు, ఆరుపోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లు, పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లు అభ్యసిస్తున్నారని తెలిపారు. డొమైన్‌ల సవాళ్లను పరిష్కరించడానికి ఫైవ్‌ జి యూజ్‌-కేస్‌, స్మార్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, డ్రోన్‌లు, రోబోటిక్‌ల ల్యాబ్‌లను కూడా ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు చేసిందన్నారు.

➡️