మానవాళికి హితాన్ని బోధించే రంజాన్‌

గవర్నర్‌, ప్రభృతుల రంజాన్‌ శుభాకాంక్షలు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మానవాళికి హితాన్ని బోధించే పండగ రంజాన్‌ అని గవర్నరు ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణ, దాతృత్వానికి ప్రతీక అని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రంజాన్‌ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర దివ్యఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని, అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు శుభాలు కలగాలని టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు.

➡️