15 నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌ ప్రక్రియ

Dec 14,2023 08:40 #contract and out sourcing
regularization of contract employees process

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వివిధ ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి బుధవారం సర్క్యులర్‌ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రెగ్యులరైజేషన్‌ ఆఫ్‌ సర్వీస్‌ ఆఫ్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యాక్ట్‌ 2023 ప్రకారం 2012 జూన్‌ 2 తరువాత ఉద్యోగంలో చేరినవారిని అర్హులుగా పేర్కొన్నారు. అఱసష్ట్రఱ.aజూషటరర.ఱఅ వెబ్‌సైట్‌లో ఈ నెల 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. దరఖాస్తులను శాఖల అధిపతులు ప్రాథమికంగా నిర్ధారించిన తర్వాత ట్రెజరీ, అకౌంట్స్‌ డైరెక్టరేట్‌ ఆడిట్‌ చేస్తుందని, అనంతరం వాటిని ఆర్థికశాఖ ఖరారు చేస్తుందన్నారు. సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్‌ 9985980996, 9989253084, 9441537344ను సంప్రదించాలని సూచించారు.

➡️