కర్నాటకలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు కర్నూలు వాసులు మృతి

దావణగెరి (కర్నాటక) : టెంపో వాహనం టైరు పంక్చరయ్యి అదుపుతప్పడంతో ప్రమాదం జరిగి ముగ్గురు కర్నూలు వాసులు మృతి చెందిన ఘటన సోమవారం కర్నాటకలో జరిగింది. కర్నాటకలోని దావణగెరి వద్ద టెంపో వాహనం టైర్‌ పంక్చరై అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు మిర్చి రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. మిర్చి లోడ్‌తో టెంపోలో బ్యాడిగి మార్కెట్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మఅతులను పెద్దకడుబూరు మండలం నాగలాపురానికి చెందిన మస్తాన్‌, పెద్దవెంకన్న, మంత్రాలయం మండలం శింగరాజనహల్లికి చెందిన ఈరన్నలుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️