అన్నదాతకు బాసటగా “రైతు కవనం”

rythu kavanam on occation of aiks council meet

ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్ : పాలకుల అవలంభిస్తున్న రైతువ్యతిరేక విధానాలతో అన్నదాత తీవ్రసంక్షోభంలో కూరుకుపోతున్నాడని రైతుకు బాసటగా నిలచి మనోధైర్యాన్ని కల్పించాలన్న ఉద్దేశ్యంతో కవులు కళాకారులు తమ కలాలను గళాలను వినిపించనున్నారని సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు అన్నారు. కర్నూల్ నగరంలోని కెకె భవన్ లో ఎఐకెయస్ ఆహ్వాన సంఘం నాయకులతో శుక్రవారం ఉదయం సాహితీస్రవంతి నాయకులు సమావేశమై రైతుకవనం ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10 ఆదివారం ఉదయం నగరంలోని కార్మికకర్షక భవన్ లో రైతుసమస్యలపై కవితలు పాటలు వినిపిస్తారని జిల్లా నలుమూలల నుండి హాజరౌతారన్నారు. ఈనెల 15,16,17వ తేదీలలో కర్నూల్లో జరిగే జాతీయ కౌన్సిల్ సమావేశాలకు సంఘీభావంగా రైతుకవనం ఏర్పాటు చేశామని ఆహ్వాన సంఘంతో సాహితీస్రవంతి జిల్లాకమిటీతో సంయుక్తంగా నిర్వహిస్తున్నా మన్నారు. రైతుకవనంలో ఆహ్వాన సంఘం నాయకులు జి.పుల్లయ్య, డా.శంకరశర్మ పాల్గొంటున్నారని వివరించారు. సమావేశంలో ఆహ్వాన సంఘం నాయకులు రామకృష్ణ, సాహితీస్రవంతి జిల్లా గౌరవాధ్యక్షులు యంపి బసవరాజు, ప్రధానకార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్ , సహధ్యక్షులు పార్వతయ్య పాల్గొన్నారు.

➡️