554 కిలోల గంజాయి పట్టివేత.. ఏడుగురు అరెస్టు

ప్రజాశక్తి – కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని చీడిపాలెం జంక్షన్‌ వద్ద గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురిని అరెస్టు చేశారు. సిఐ పి వెంకటరమణ కేసు వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. సీలేరు ప్రాంతం నుంచి కొయ్యూరు మీదుగా గంజాయి గుట్టుగా తరలుతుందన్న సమాచారంతో కొయ్యూరు ఎస్‌ఐ రామకృష్ణ, మంప ఎస్‌ఐ లోకేష్‌ కుమార్‌ చీడిపాలెం వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జీపు, రెండు ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న 554 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. గంజాయి సాగు, రవాణాకు ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.

➡️