కడపలో షర్మిల

Apr 3,2024 07:36 #Kadapa, #ys sharmila
  • రాష్ట్రంలో 5 లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు
  • కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన
  • అలాగే ఒడిషా, బీహార్‌, బెంగాల్‌లో మరో 12 ఎంపీ స్థానాలకు కూడా

ప్రజాశక్తి అమరావతి బ్యూరో : కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. కడపతో బాటు అయిదు లోక్‌సభ స్థానాలకు, 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఎఐసిసి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులు షర్మిల మంగళవారం ఇడుపులపాయలో ఈ జాబితాను విడుదల చేశారు. మిగిలిన స్థానాలకు సంబంధించి త్వరలో మరో జాబితా విడుదల చేసేందుకు ఎఐసిసి, ఎపిసిసి సన్నాహాలు చేస్తున్నాయి. దీంతోబాటే ఒడిశా(8) , బీహార్‌ (3), బెంగాల్‌(1)లోని మరో 12 లోక్‌సభ స్థానాలకు కూడా కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు తారిఖ్‌ అన్వర్‌ బీహార్‌లోని కటిహార్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మన రాష్ట్రంలో తొలి జాబితాలో కడప లోక్‌సభతో బాటు కాకినాడ (ఎంఎం పల్లంరాజు) రాజమండ్రి( గిడుగు రుద్రరాజు), బాపట్ల (, జేడి శీలం) కర్నూలు (పిజి రామ్‌పుల్లయ్య యాదవ్‌) స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. -వివరాలు 2,3 పేజీల్లో

➡️