ఏం అన్యాయం జరిగిందో షర్మిల చెప్పాలి-సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:షర్మిలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏం అన్యాయం చేశారో స్పష్టంగా చెప్పాలని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు ఎప్పుడూ కుటుంబ వ్యవహారంగా వుండవని, ప్రజాస్వామ్యంలో అలా వుండదనే అంశాన్ని ఆమె తెలుసుకోవాలని సూచించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. షర్మిల ఏం ఆశించి వైసిపిలో పనిచేశారో చెప్పాలన్నారు. మొన్నటి వరకు తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్న షర్మిల.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. గంగవరం పోర్టు వాటా అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో రాష్ట్రంలో నాలుగు పోర్టులు కడుతున్నామని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంటు కోసం పార్టీ తరపున కేంద్రంతో పోరాడుతున్నామని చెప్పారు. మణిపూర్‌ విషయంపై షర్మిల తెలంగాణలో సొంత పార్టీ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. చంద్రబాబు ప్రణాళిక ప్రకారం షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చారని అన్నారు.

➡️