పవన్‌ కల్యాణ్‌కు షాక్‌.. క్రిమినల్‌ కేసు నమోదు

Feb 18,2024 11:22 #JanaSena, #pavan kalyan, #police case

ప్రజాశక్తి-అమరావతి : జనసేన అధినేత పవన్‌పై గుంటూరులో క్రిమినల్‌ కేసు నమోదైంది. దీంతో, కోర్టు ఎదుట హాజరు కావాలని జిల్లా జడ్జి శరత్‌బాబు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరాల ప్రకారం.. జూలై మూడో తేదీన ఏలూరులో జరిగిన వారాహియాత్రలో వాలంటీర్లపై పవన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ వాలంటీర్లు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు డైరెక్షన్‌తో ఐపీసీ సెక్షన్‌ 499, 500 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 25వ తేదీన గుంటూరు కోర్టులో పవన్‌ హాజరు కావాలని నాలుగో అదనపు జడ్జి శరత్‌బాబు తాజాగా ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేశారు.

➡️