హనుమంత వాహనంపై ఉరేగిన శ్రీ గోవిందరాజస్వామి

May 21,2024 12:30 #tirumala tirupathi temple, #ttd

ప్రజాశక్తి-తిరుమల : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి హనుమంత వాహనంపై యాత్రికులకు దర్శనమిచ్చారు. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు వసంతోత్సవం వైభవంగా నిర్వహించగా.. శ్రీవారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌స్వామి, సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు, ఆలయ డెప్యూటి ఈవో శాంతి, సూపరింటెండెంట్‌ నారాయణ యాత్రికులు పాల్గొన్నారు.

➡️