అంగన్‌వాడీల సమస్యలను రేపటిలోగా పరిష్కరించండి.. లేదంటే ప్రత్యక్ష కార్యాచరణ : కార్మిక సంఘాల హెచ్చరిక

  • రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్ణయం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్‌వాడీల సమస్యలను రేపటిలోగా (17వ తేది, ఆదివారం) పరిష్కరించాలని లేని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని కార్మికసంఘాలు హెచ్చరించాయి. విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో కార్మిక సంఘాల ఐక్య వేధిక ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రౌండ్‌టేబుల్‌ సమా వేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాల నేతలు హజరై సమ్మెకు తమ సంఘీభావాన్ని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని నాలుగేళ్లుగా అంగన్‌వాడీలు కోరు తున్నారని, అయినా ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు వెళ్లారని తెలిపారు. మరోమార్గం లేక సమ్మె చేస్తున్న వారిపై ప్రభుత్వం నిర్భందాన్ని, దౌర్జన్యా లను ఆపకపోతే ఐక్యంగా ప్రతిఘటిస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఎఐటియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి ఓబులేసు మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించమని కోరితే సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి కోపం వస్తుందని అధి కారులు అనడం సబబుకాదన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమస్యలపై వినతి పత్రం ఇస్తే పెళ్లి పత్రికలు ఇస్తున్నారా అంటూ అవమానిం చడం తగదని అన్నారు. చిరుద్యోగులకు వేతనాలకు నిధుల కొరత చూపుతున్న సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి కోట్లు ఖర్చుచేసి జిల్లాల పర్యటనలకు వెడుతున్నా రని విమర్శించారు. సభకు అధ్యక్షత వహించిన వి ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అణచి వేత చర్యలకు పాల్పడటం సరైంది కాదన్నారు. అంగన్వాడీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొబ్బిలి ఎమ్మెల్యేపై చర్య లు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఐదేళ్ళ క్రితం ఇచ్చిన హామీలను అమలు చేయక పోగా అవాస్తవాలను ప్రచారం చెయ్యడం ప్రభుత్వానికి తగదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి భారతి మాట్లాడుతూ సెంటర్ల తాళాలు పగల కొట్టి ఇతర సిబ్బందితో విధులు నిర్వహించాలనే ప్రభుత్వ వైఖరి సరైంది కాదన్నారు. ప్రభుత్వమే కార్మిక వ్యతిరేక వైఖరికి పాల్పడటం తగదని అన్నారు. ఇప్పటికే వందలాది సంఘాలు ఈ పోరాటానికి అండగా నిలి చాయన్నారు. ప్రజల మద్దతు కూడగట్టుకుని పోరాటం తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ సమా వేశంలో సిఐటియు నాయకులు పి అజరు కుమార్‌, ఆర్‌వి నర్సింహా రావు, ఎపి రైతు సంఘం నాయ కులు ప్రసాద్‌, కౌలు రైతు సంఘం నాయకులు పి జమలయ్య, ఎఐటియుసి నాయకులు ఆర్‌ రవీంద్ర నాథ్‌, మహిళా సంఘాల నాయకులు పి దుర్గా భవా ని, ఎం శ్రీదేవి, యువజన సంఘం నాయకులు రాము, లెనిన్‌, బ్యాంకు ఉద్యోగ సంఘం నాయకులు ఆర్‌ అజరు కుమార్‌, ఎల్‌ఐసి ఉద్యోగ సంఘ నాయ కులు ఎంవి. సుధాకర్‌, ప్రజా నాట్య మండలి నాయ కులు పిచ్చయ్య, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు జి నట రాజ్‌, ఐఎఫ్‌టియు ఎ రవి చంద్ర, టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ నాయకు లు ఎంవి ఆంజనేయులు, ఆశా వర్కర్ల నాయకులు పి శ్రీలక్ష్మి, అంగన్‌వాడీ నాయకులు లలితమ్మ, పెన్ష నర్లసంఘం నాయకులు టి ప్రభుదాస్‌ పాల్గొన్నారు.

➡️