సంక్రాంతి పండుగ వేళ … పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

దక్షిణమధ్య రైల్వే : సంక్రాంతి పండుగ సమీపిస్తోన్న వేళ … ప్రయాణీకుల సౌకర్యార్థం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

  • హైదరాబాద్‌-తిరుపతి (07489/07490) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతికి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో 30వ తేదీ రాత్రి 8.25కు బయలుదేరి ఉదయం 8.50కి హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
  • హైదరాబాద్‌-తిరుపతి (07449/07450) మరో స్పెషల్‌ ట్రైన్‌ – ఈ నెల 27వ తేదీ సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.45కు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 28వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.30కు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
  • హైదరాబాద్‌-కాకినాడ (074­51/­074­5­2) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 29న రాత్రి 8.30కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 30వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9 గంటలకి హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
➡️