రెక్టిఫైట్‌ స్పిరిట్‌ స్థావరంలో రూ.2 కోట్ల విలువ చేసే స్పిరిట్‌ స్వాధీనం

May 9,2024 18:03 #seaze, #spirit

హైదరాబాద్‌ : నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా రెక్టిఫైట్‌ స్పిరిట్‌ను నిల్వ ఉంచిన స్థావరంపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడిలో రూ.2 కోట్ల 31 లక్షల విలువ గల 21 వేల లీటర్ల స్పిరిట్‌ను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను ప్రొహిభిషన్‌, ఎక్సైజ్‌శాఖా డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి వెళ్లడించారు.
దూలపల్లి పారిశ్రామిక వాడలో సర్వేనంబర్‌ 135లో జగదాంబ కెమికల్స్‌ గోదాంలో ఎలాంటి అనుమతులు లేకుండా అధిక మొత్తంలో వైట్‌నర్‌ ఇతర మత్తుపదార్థాలలో వినియోగించే రెక్టిఫైట్‌ స్పిరిట్‌ ఉందని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేపట్టామన్నారు. ఈ దాడిలో దాదాపుగా రూ.2 కోట్ల 31 లక్షల విలువ చేసే 21 వేల లీటర్ల స్పిరిట్‌ డ్రమ్ముల్లో నిల్వ చేసి ఉందన్నారు. స్పిరిట్‌ను స్వాధీనం చేసుకొని నిర్వాహకులైన హనుమన్‌ రామ్‌సేన్‌, హరిరామ్‌లను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన్నట్లు తెలిపారు.

➡️