వైభవంగా శ్రీకోదండరాముని రథోత్సవం

Apr 23,2024 22:00 #Chariotsavam, #Vontimitta

ప్రజాశక్తి-ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా) :వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం శ్రీకోదండరామస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సీతా లక్ష్మణ సమేత కోదండరాముల వారితో జరిగిన ఈ రథోత్సవం ఉదయం 10.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. భజన బృందాలు, చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా యాత్రికులు రథాన్ని లాగారు. అడుగడుగునా జనం కర్పూర నీరాజనాలు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇఒ నటేష్‌ బాబు, టెంపుల్‌ ఇన్స్‌పెక్టర్‌ నవీన్‌, ఇంజనీరింగ్‌ అధికారులు, పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు.

➡️