సమగ్రశిక్షా ఉద్యోగుల రాస్తారోకో

ssa employees protest in kakinada

ప్రజాశక్తి-కాకినాడ : విద్యా శాఖలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులు సమ్మె ప్రారంభించి 13వ రోజుకు చేరుకున్న సందర్భంగా కాకినాడ ధర్నా చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని నినాదాలు చేశారు. తక్షణం జగన్మోహన్ రెడ్డి హామీ మేరకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పార్ట్ టైం ఉద్యోగులను ఫుల్ టైం గా మార్చి మినిమం టైమ్స్ స్కెల్ అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సోమవారం శిబిరానికి యూటీఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు కెవివి.నగేష్, టి.రవిచక్రవర్తి, కెవివి. రమణ, అసిసియేట్ అద్యక్షలు వివి.రమణ, నాగమణి, గౌరవ అధ్యక్షులు ఎంవి.సాయిరాం, రాష్ట్ర కార్యదర్శి టి. అన్నారామ్, కోశాధికారి పివిఎన్. గణేష్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమనికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు ఎం.చంటిబాబు, సత్యనాగమని, ఏ.లోవరాజు, సహాయ కార్యదర్సులు జి.నారాయణ, శ్రీనివాస్, జిల్లా కోశాధికారి పి.రాజు, ఎం.గంగాధర్ తదితరులు నాయకత్వం వహించారు.

 

ssa employees protest in vzm

  • పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టిన సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

12 వ రోజుకి చేరిన సమ్మె
ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం
సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జె ఏ సి రాష్ట్ర అధ్యక్షులు కాంతారావు
విజయనగరం టౌన్ : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె సోమవారం నాటికి 12వ రోజుకి చేరుకుంది. సమ్మెలో భాగంగా పోస్ట్ కార్డులు ముఖ్యమంత్రికి రాసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎపి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జెఏసీ రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి బొత్స చర్చలు జరిపి ఎటువంటి పరిష్కారం చూపకుండా సమ్మెను విరమించమని కోరడం సరికాదని అన్నారు. మేము ప్రభుత్వానికి కొత్త గా ఏమి అడగలేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ లు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. కేవలం మాటలు చెప్పి మా సమ్మెను విరమించాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరడం సరికాదని అన్నారు. ప్రభుత్వం మా వేతనాలు, రెగ్యులరైజేషన్ గురుంచి స్పష్టమైన హామీ ఇస్తే తప్ప సమ్మె విరమించేది లేదన్నారు. అనంతరం పోస్టు కార్డులను తపాలా బాక్స్ లో వేసి సిఎం కి పంపించారు. కార్యక్రమంలో జె ఏ సి జిల్లా అధ్యక్షుడు గురువులు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️