రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా 2 కార్లు స్వాధీనం

Mar 22,2024 10:00 #2, #cars, #seized, #State Minister

గాజువాక (విశాఖ) : ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా … నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లను ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. వైసిపి జెండా రంగులు, సిద్ధం స్టిక్కర్లు ఉన్న రెండు ప్రభుత్వ వాహనాలు విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరాయన్న సమాచారం అందడంతో… గురువారం విశాఖలోని అగనంపూడి టోలు గేటు సమీపంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇన్‌ఛార్జి అధికారి రేవతి, పోలీసులు వాహనాల సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో … మంత్రి రాజాను విమానాశ్రయంలో దించి గన్‌మెన్లు, మరికొందరు కార్యకర్తలు ఆ వాహనాలతో తిరిగి తునికి వెళుతున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. వెంటనే ఆ రెండు కారులను స్వాధీనం చేసుకుని, అందులో ప్రయాణిస్తున్న వారిని దువ్వాడ పోలీసులకు అప్పగించారు.

➡️