టెన్త్‌ ఫైనల్‌ ఎగ్జామ్‌కు వెళుతుండగా ప్రమాదం – విద్యార్థి మృతి

Mar 27,2024 10:53 #10th final exam, #accident, #died, #student

ప్రజాశక్తి-బి.కొత్తకోట (రాయచోటి-అన్నమయ్య) : తండ్రికి భోజనం క్యారేజీ ఇచ్చి పదో తరగతి ఫైనల్‌ ఎగ్జామ్‌కు వెళుతున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన బుధవారం పెద్దతిప్పసముద్రం మండలంలో జరిగింది. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

మద్దయ్యగారిపల్లి పంచాయతీ కుమ్మరవారిపల్లి సమీపాన రెండు బైక్‌లు ఢకొీట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో సాయి చరణ్‌ (15)కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మదనపల్లి ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. మదనపల్లి జిల్లా హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ సాయిచరణ్‌ మఅతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో యువకుడు శ్యామ్‌ (15) పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరు ఆసుపత్రికి రిఫర్‌ చేసినట్లు డాక్టర్లు తెలిపారు. బైక్‌ పై ఉన్న మరో ప్రయాణీకుడు కాట్నగల్లు కు చెందిన నరసింహులు (30), మరో వ్యక్తి వెంకటేష్‌ కు తీవ్ర గాయాలవ్వడంతో వారిని వెంటనే మదనపల్లికి రిఫర్‌ చేసినట్లు బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రి డాక్టర్స్‌ తెలిపారు.

సాయి చరణ్‌ మరణవార్తతో కుటుంబంలో విషాదం అలుముకుంది. బి.కొత్తకోట పట్టణంలోని శ్రీ చైతన్య చిల్డ్రన్స్‌ అకాడమీ స్కూల్‌ లో సాయిచరణ్‌ పదో తరగతి చదువుతున్నట్లు బంధువులు తెలిపారు. సాయిచరణ్‌ మెరిట్‌ స్టూడెంట్‌ అని స్కూల్‌ ప్రిన్సిపల్‌ కేశవరెడ్డి తెలిపారు. డాక్టర్‌ కావాలని వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారని మెరిట్‌ స్టూడెంట్‌ చనిపోవడం చాలా బాధాకరమని స్కూల్‌ ప్రిన్సిపల్‌ కేశవరెడ్డి తన బాధని వ్యక్తపరిచారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

➡️