డిఒపిగా సుదర్శన్‌రెడ్డి నియామకం చెల్లదు : హైకోర్టు

Feb 22,2024 12:37 #AP High Court, #Appointments, #DOP, #invalid

ప్రజాశక్తి-అమరావతి : డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ (డిఒపి)గా జె సుదర్శన్‌రెడ్డి నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆయన నియామకం చట్ట నిబంధనలకు విరుద్ధమని వెల్లడించింది. ప్రాసిక్యూషన్స్‌ నుంచి వచ్చిన వ్యక్తినే డిఒపిగా నియమించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నట్లు తెలిపింది. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను సంప్రదించి 4 మాసాల్లో కొత్త డిఒపిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం తీర్పు చెప్పింది. డిఒపిగా సుదర్శన్‌రెడ్డిని నియమిస్తూ 2023 మే 22న వెలువరించిన జిఓ 522ను రద్దు చేయాలంటూ అదనపు డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ బి రామకోటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది.

➡️