వివేకాను హత్య చేసిన వ్యక్తికి సునీత మద్దతు – ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

ప్రజాశక్తి-కడప :వివేకానందరెడ్డిని హత్య చేసిన వ్యక్తికి సునీత మద్దతు ఇవ్వడం బాధాకరంగా ఉందని కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా వైసిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివేక హత్య వెనుక ఎవరున్నారనేది అందరికీ బాగా తెలుసన్నారు. స్వయంగా హత్య చేశానని దస్తగిరి ఒప్పుకున్నాడని గుర్తుచేశారు. నేరుగా తానే చంపాను అంటున్న వ్యక్తికి మద్దతు ఇచ్చి బెయిల్‌ కూడా ఇప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టిడిపి ప్లాన్‌తోనే వివేకా హత్య జరిగిందని ఆరోపించారు. దస్తగిరికి బెయిల్‌ రావడానికి టిడిపి ప్రమేయం కూడా ఉందన్నారు. టిడిపికి జనసేన, బిజెపితో ప్రత్యక్షంగా పొత్తు, పరోక్షంగా కాంగ్రెస్‌తో బాబుకు పొత్తుందన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైన వెసిపిని ఏమి చేయలేరని తెలిపారు. సమావేశంలో వైసిపి నాయకులు పులి సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️