తాటాకిల్లు దగ్ధం – కట్టుబట్టలతో రోడ్డునపడ్డ వృద్ధ దంపతులు

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : అగ్నిప్రమాదంలో తాటికిల్లు దగ్ధమవ్వడంతో కట్టుబట్టలతో వృద్ధ దంపతులు రోడ్డునపడ్డ విషాద ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మండలంలోని తూర్పుతాళ్ళు పంచాయితీ సైపు వారి మెరక లో ఆకుల సత్యనారాయణ కు చెందిన తాటాకిల్లు అగ్నికి దగ్ధమయ్యింది. ఈ ప్రమాదంలో బాధితులు కట్టుబట్టలతో బయటపడ్డారు. వారి ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు జరిగాయి. వృద్ధాప్యంలో పింఛన్‌ డబ్బులతో దంపతులు జీవిస్తున్నారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. అప్పటికే జరగాల్సిన నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు.

➡️