అసెంబ్లీ నుంచి టిడిపి సభ్యులు వాకౌట్‌

Feb 5,2024 12:09 #ap assembly, #TDP members, #walk out

అమరావతి : నేడు ప్రారంభమైన ఎపి అసెంబ్లీ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి సభ్యులు వాకౌట్‌ చేశారు. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ” సార్‌.. మీతో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోంది ” అంటూ నిరసన తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఇన్‌ పుట్‌ సబ్సిడీని రైతులకు కాకుండా వైసిపి నేతలకు ఇచ్చారని విమర్శించారు. అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారని అన్నారు. విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ చేశామని గవర్నర్‌ చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ ‘ అంటూ నినాదాలు చేశారు. టిడిపి సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో గవర్నర్‌ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి సభ్యులు వాకౌట్‌ చేశారు.

➡️