ఉండిలో టిడిపి రెబల్

Mar 16,2024 11:00 #bhimavaram, #Rebel Candidates, #TDP

ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు

ప్రజాశక్తి-భీమవరం : ఉండి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు (కలపూడి శివ ) రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం స్థానిక క్యాంప్ కార్యాలయంలో శివరామరాజు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు, ప్రజల ఆకాంక్ష మేరకు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఆక్వా రంగా రైతులు, వారి రైతులు, యువత ఎంతోమంది ఉన్నారని వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆక్వా రంగానికి నిరంతరం విద్యుత్ను అందించడం జరిగిందన్నారు. రైతులు, కవుల రైతులు, వ్యవసాయ కూలీలు అభివృద్ధికి పాటుపడ్డాను అన్నారు. వీరందరి ఆకాంక్ష మేరకు ప్రజాక్షేత్రంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నన్ను ఆదరించి అండగా ఉండాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఉండి ఏఎంసి మాజీ చైర్మన్ సాగరాజు సాంబరాజు ఉన్నారు.

➡️