పల్నాడులో టిడిపి కార్యకర్త కారు దగ్ధం

Mar 19,2024 21:37 #bonfires, #car, #leader, #TDP

ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) : సమస్యాత్మక ప్రాంతమైన పల్నాడులో ఎన్నికల వేళ మరో వివాదం తలెత్తింది. మాచర్ల పట్టణంలో టిడిపి కార్యకర్తకు చెందిన కారును కొందరు దుండగులు దగ్ధం చేశారు. బాధితుని కథనం మేరకు..స్థానిక సాగర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్న ఇర్ల సురేష్‌ తన కారును ఇంటికి సమీపంలోని రహదారి పక్కన పార్కు చేశారు. కొందరు దుండగులు సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత దగ్ధం చేశారు. అనంతరం మరో కారులో పరారయ్యారు. భాదితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే టిడిపికి చెందిన ఆరుగురు బిసి నాయకులను చంపారని, ఇప్పుడు ఆస్తులనూ ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు.

➡️