ఏపీఎస్‌ ఆర్టీసీ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య.. ప్రయాణికుల అవస్థలు

May 11,2024 13:08 #aps rtc, #ticket booking
పండుగకు ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు

ప్రజాశక్తి-విజయవాడ: ఏపీలో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలు, పక్క జిల్లాల్లో ఉన్న ఓటర్లు స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో ఏపీఎస్‌ ఆర్టీసీ రిజర్వేషన్‌ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సర్వర్‌ తరచూ మొరాయిస్తోంది. శనివారం ఉదయం నుంచే సమస్య ఉన్నా అధికారులు పరిష్కరించలేదు. టికెట్లు బుక్‌ చేసుకునేందుకు విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ప్రయాణికులు గంటల తరబడి వేచిచూస్తూ అవస్థలు పడుతున్నారు. అక్కడి రిజర్వేషన్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. బస్సులు లేకపోవడం, టికెట్లు జారీ కాకపోవడంతో ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

➡️