తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు – బిఆర్‌ఎస్‌ నేతల వినూత్న నిరసన

తెలంగాణ : తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో … బిఆర్‌ఎస్‌ నేతలు వినూత్న నిరసన తెలిపారు. ఆటోడ్రైవర్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి వెళ్లారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి అసెంబ్లీ వరకూ ఆటోలో ప్రయాణించారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్లకార్డులను ప్రదర్శించారు. 6.5 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డునపడ్డారని, వారికి నెలకు రూ.10 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు సభలోకి ప్లకార్డులను తీసుకెళ్లేందుకు బిఆర్‌ఎస్‌ నేతలు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నల్ల కండువాలు వేసుకుని శాసన మండలికి వచ్చిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలను ముందుగా భద్రతా సిబ్బంది లోనికి అనుమతించలేదు. కాసేపు వాగ్వాదం తర్వాత లోపలికి అనుమతించారు.

➡️