తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న తెలంగాణ సిఎం

తిరుపతి : తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్‌ రెడ్డి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు విఐపి బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.

➡️